Part-2 Trend : ఈ నడుమ పార్ట్-2 ట్రెండ్ ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా.. అసలు సెకండ్ పార్ట్ కు కథలో స్కోప్ లేకపోయినా క్రేజ్ ను వాడుకోవాలని సెకండ్ పార్టు ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాగా అవ్వవు కదా. కథలో బలం ఉంటేనే సెకండ్ పార్ట్ కు వెళ్లాలి. ఒకే పార్టులో కథ చెప్పేసే అవకాశం ఉన్నా సరే కథలను సాగదీస్తూ రెండు పార్టులుగా డివైడ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మొదటి పార్టు పెద్దగా హిట్ కావట్లేదు. దాంతో రెండో పార్టు వస్తుందో రాదో తెలియట్లేదు. రాబిన్ హుడ్, రామారావు ఆన్ డ్యూటీ, హరిహర వీరమల్లు, కింగ్ డమ్.. ఈ సినిమాలు మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నవి.
Read Also : Kingdom : పార్ట్-2లో పెద్ద హీరో..!
వీటికి మళ్లీ పార్ట్-2 అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. ఒకే పార్టులో ఈ కథలను చెప్పే అవకాశాలు ఉన్నా సరే ఏదో హైప్ కోసమో లేదంటే బజ్ కోసమే ఇలా రెండేసి పార్టులు అనౌన్స్ చేస్తున్నారు. అలా చేస్తే మూవీకి కూడా పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదు. మొదటి పార్టు ఓ రేంజ్ లో హిట్ అయ్యి.. చివర్లో ఓ సస్పెన్స్ క్రియేట్ చేయగలిగితేనే రెండో పార్టుపై ప్రేక్షకుల్లో ఆతృత ఉంటుంది. బాహుబలి, కేజీఎఫ్, సలార్ సినిమాల్లో చివర్లో రెండో పార్టుపై అంచనాలు పెంచేలా హింట్ ఇచ్చారు. మరి ఈ సినిమాల్లో ఆ స్థాయి సప్పెన్స్ ఏమైనా రెండో పార్టు కోసం ఉన్నాయా అంటే పెద్దగా ఏమీ లేవు. అందుకే వీటికి పార్ట్-2 అవసరమా అంటున్నారు ప్రేక్షకులు.
Read Also : Kingdom : విజయ్ ‘కిస్’ సీన్ పై నాగవంశీ సెటైర్లు
