Pallavi Prashanth Responds on his arrest: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నా కామన్ మ్యాన్ అని పేరుతో లోపలికి పంపారు. అలా వెళ్ళి హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక చివరికిపల్లవి ప్రశాంత్ విన్నర్ గా అవతరించాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలవగా శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో ఎదుట అల్లర్లు జరిగాయి. పల్లవి ప్రశాంత్ -అమర్ అభిమానులు పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. ఎవరు చేశారో కానీ పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం అయింది. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్వినిశ్రీ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.
Shriya Saran: అదిరిపోయే లుక్ లో శ్రీయా శరన్ స్టన్నింగ్ పోజులు..
స్టూడియో బయట ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక గేటు నుంచి బయటకు పంపగా నేను గెలిచా వెనక్కు వెళ్ళేది ఏంటి అని ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. రెండు రోజులు జైల్లో ఉన్న ప్రశాంత్ బెయిల్ పై బయటకు వచ్చాక మీడియాకీ దూరంగా ఉంటూ వస్తున్న పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత మొదటిసారి ఆ సంఘటనపై స్పందించాడు. బీబీ ఉత్సవం పేరుతో స్టార్ మా స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేయగా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ అందరూ ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఆ షో ప్రోమోలో తన తండ్రిని తలచుకుని పల్లవి ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు. కప్ కొట్టి మా నాన్న కళ్ళలో సంతోషం చూడాలి అనుకున్నా, కానీ ఆయన కోర్టు బయట పడుకుని ఉన్న వీడియో చూసి గుండె బద్దలైందన్నాడు. అది చూసి నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాను? చచ్చిపోతే బాగుండు అనిపించింది అని అంటూ ఎమోషనల్ అయ్యాడు.