NTV Telugu Site icon

Pallavi Prashanth: రైతు బిడ్డ ఒరిజినాలిటీ.. విన్నర్ అయ్యాక బలుపు చూపిస్తున్న పల్లవి ప్రశాంత్

Pallavi

Pallavi

Pallavi Prashanth: ఏరు దాటేవరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య.. ఈ సామెత వినే ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఈ సామెత చక్కగా సరిపోతుంది. అన్నా.. మా పొలంలో నీళ్లు రాలేదు.. పంట పండలేదు.. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేసుకొనే కుర్రాడు.. గత మూడు సీజన్లుగా బిగ్ బాస్ హూసు కు వెళ్ళడానికి అందరిని అడిగి అడిగి.. ఇంటర్వ్యూలు ఇచ్చి.. ఏడ్చి రచ్చచేసి.. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఒక రైతు బిడ్డగా.. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వెళ్లడంతో అందరి చూపు అతనిపై పడింది. ఇక నోట్లో నాలుక లేనివాడిగా.. అమాయకుడిగా నటిస్తూ.. అటు అభిమానులనే కాదు శివాజీని కూడా బుట్టలో వేసుకున్నాడు. అతడు తనకు సపోర్ట్ చేసేలా చేసుకొని.. చివరికి జనాలు ఇచ్చిన సపోర్ట్ తో విన్నర్ గా బయటకు వచ్చాడు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. బయటకు వచ్చాకా.. ప్రశాంత్ ఒరిజినాలిటీ బయటపడింది. విన్నర్ అవ్వడం తోనే బలుపు చూపించడం మొదలుపెట్టాడు. బయటకు రావడంతోనే పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళమని పోలీసులు చెప్పినా.. పట్టించుకోకుండా మళ్లీ వెనక్కి వచ్చి రచ్చ చేశాడు.. మాట్లాడితే రైతుబిడ్డలను పట్టించుకోరా.. అని పోలీసులకు ఎదురుతిరిగి కేసులు పెట్టించుకొనేవరకు వెళ్ళాడు. సర్లే ఇదంతా ఎప్పుడు ఉండేదే కదా అని అనుకుంటే.. విన్నర్ గా అయ్యాక.. ప్రశాంత్ కళ్ళు నెత్తికి ఎక్కాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇంటికి వెళ్ళాక.. స్నేహితులను దూరం పెట్టాడు.. బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని మరిచి.. తాను విజయం అందుకున్నట్లు గర్వం చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అందరికి తెలిసేలా చేసింది యాంకర్ శివ. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే మొదటి ఇంటర్వ్యూ తనకే ఇస్తాను అని చెప్పిన ప్రశాంత్ మాట తప్పాడు. శివకు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పి ఇంటికి పిలిచి.. 8 గంటలు ఎదురుచూసేలా చేసి.. చివరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా పంపించేశాడు. దీంతో శివ తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “ప్రశాంత్‌.. 18 గంటలు వెయిట్‌ చేయించి ఇంటికి రా అన్నా.. ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి బయట 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను.. వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. గొప్ప విన్నర్‌ ప్రశాంత్‌.. అక్కడే ఉన్న తన స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు.. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేదు.. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు” అని వాపోయాడు. దీంతో ఇది రైతు బిడ్డ ఒరిజినాలిటీ.. విన్నర్ అయ్యాక బలుపు చూపిస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు.