వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్యాకప్’. జివిఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఎ. ఎమ్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాల’ని ఆకాంక్షించారు.
ఓ మంచి కథతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని వాసం రమేశ్ తెలుపగా, ప్రస్తుతం డాక్టర్ గా ఉన్న తాను ఈ సినిమాతో యాక్టర్ గా మారడం ఆనందంగా ఉందని ఆశ ప్రమీల చెప్పింది. ‘మంచి కథకు, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అన్ని అంశాలను మిళితం చేసి చెప్పబోతున్నామని, ప్రేమలో ఉండే ఒక వైవిధ్యకోణాన్ని ఈ చిత్రంలో చూపబోతున్నామ’ని దర్శకుడు జీవీఎస్ ప్రణీల్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్, కెమెరామెన్ వైవి శ్రీధర్, విఎఫ్ఎక్స్ హెడ్ పీటర్ విజయ్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్ శ్రీకృష్ణ గుళ్లపల్లి తదితరులు పాల్గొని మూవీ విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.
