Pa Ranjith Brother Engaged In Land Dispute CC TV Footage goes Viral: ఒక భూ వివాదంలో తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ సోదరుడు వెళ్లి తన అనుచరులతో దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనకుఇ చెందిన వివరాల్లోకి వెళితే చెన్నైలోని మనాలి పుదునగర్‌లో నివసిస్తున్న రిషి అనే వ్యక్తి 2019లో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అదే ప్రాంతానికి చెందిన షకీల 1.5 ఎకరాల భూమి నాదని, నాకు తెలియకుండా నా బంధువులు ఆ భూమిని అమ్మేశారని ఆరోపిస్తోంది. సంబంధిత కేసు విచారణలో ఉంది. ఈ స్థితిలో ఈరోజు నిన్న ప్రముఖ తమిళ సినీ దర్శకుడు బా.రంజిత్ ప్రభు సోదరుడి సహకారంతో షకీలా కొంతమంది దుండగులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పంచాయతీ జరిగింది. అయితే వారి మధ్య వాగ్వాదం ముగియక పోవడంతో పా.రంజిత్ సోదరుడితో పాటు వచ్చిన వ్యక్తులు వ్యాపారి స్థలంలో ఉన్న సీసీ కెమెరాలపై దాడి చేసి రాళ్లతో పగలగొట్టి గార్డు ఫోన్ లాక్కొని వాగ్వాదానికి దిగారని అంటున్నారు.
Suriya: కొత్త వివాదంలో హీరో సూర్య.. అసలేమైందంటే?
రంజిత్ సోదరుడు ప్రభు, అతని వెంట వచ్చిన లాయర్లపై రిషి మనాలి పుదునగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ”తమిళ సినీ దర్శకుడు పా.రంజిత్ సోదరుడు ప్రభు సోదరుడు, షకీలా ప్రజలను కూడగట్టి అసభ్యకర చర్యకు పాల్పడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విడుదలై సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తంగలాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. జివి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. కేజీఎఫ్‌లో ఉన్న ఆదివాసీ తమిళుల చరిత్ర గురించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. మాళవిక మోహనన్, పశుపతి, హరి, డేనియల్ కాల్టాగిరోన్, పార్వతి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.