Priyadarshi And Nabha Natesh Darling Streaming On Disny Hot Star: ఈ వారం స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత రాఖీ పండగతో వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ లాంగ్ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి ఓటీటీల్లోకి చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఈ డార్లింగ్ మూవీ. ప్రియదర్శి, అందాల భామ నభా నటేష్ నటించిన ఈ మూవీ బుధవారం (ఆగస్ట్ 13) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. జులై 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది..
ఇక ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే హీరో చాలా అమాయకుడు, జీవితంలో అతని ఏకైక లక్ష్యం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్లడం. అయితే, ఆనంది(నభా నటేష్) తన జీవితంలోకి భార్యగా ప్రవేశించడంతో అతని కలలు చెదిరిపోతాయి. అతని డ్రీమ్స్ ని చెదరగొడుతూ, ప్రతిరోజూ తనకి చుక్కలు చూపిస్తూ, అతన్ని కొడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది?,అనే నేపథ్యంగా తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఓటీటీ ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చుడాలిసిందే.