Kannappa OTT Release: ఓటీటీలో ‘కన్నప్ప’ సినిమా.. ఆలస్యంగా స్ట్రీమింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా చివరికి ఓటీటీలోకి చేరింది. అయితే, చిన్న ట్విస్ట్ కారణంగా నెటిజన్లు కొద్దిసేపు అయోమయం చెందారు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా కూడా ఇందులో ఉన్న భారీ తారాగణం, మేకింగ్ విజువల్స్ వల్ల ఈ మూవీకి ఓటీటీలో మంచి క్రేజ్ ఏర్పడింది.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియాలో సెప్టెంబర్ 4నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కన్నప్ప’ స్ట్రీమింగ్ మొదలవుతుందని ప్రకటించారు. అయితే నిర్ణీత సమయానికి సినిమా రాకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సినిమాకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నాయా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. చివరికి అమెజాన్ ప్రైమ్ టీమ్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేయడంతో అందరికి క్లారిటీ వచ్చింది. కొద్ది గంటల ఆలస్యంగానైనా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
Lunar Eclipse: చంద్రగ్రహణం రోజున పాటించాల్సిన నియమాలు ఇవే..
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్‌లో కనిపించగా, ప్రభాస్ రుద్ర పాత్రలో, మోహన్‌లాల్ కిరాతగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా నటించారు. ప్రత్యేక పాత్రలో మోహన్ బాబు మహదేవశాస్త్రిగా ఆకట్టుకున్నారు. దాదాపు పదేళ్లుగా విష్ణు కలలుగన్న ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మించగా, ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా అయినా స్ట్రీమింగ్ ప్రారంభమవ్వడంతో.. సినిమా చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఎంజాయ్ చేయనున్నారు. చూడాలిమరి ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు కన్నప్ప అలరించగలడో.
Witness the epic, spirit of sacrifice & divinity 🙏#KANNAPPA releases digitally on Sept 4, 2025 only on Prime Video.
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#KannappaOnPrime #KannappaMovie #HarHarMahadevॐ pic.twitter.com/WVrbZ2AMvn— Vishnu Manchu (@iVishnuManchu) September 1, 2025
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!