Jilebi On Aha: శ్రీకమల్ హీరోగా శివానీ రాజశేఖర్ హీరోయిన్ గ నటించిన చిత్రం “జిలేబి” అప్పట్లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. గుంటూరు రామకృష్ణ నిర్మాతగ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో జులై 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
Also Read: Krithi Shetty: ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన కృతిశెట్టి
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక హాస్టల్‌లో స్నేహితులతో కలిసి చదువుకుంటూ ఉంటాడు కమల్. ఒకరోజు లక్ష్మీ భారతి అలియాస్ జిలేబి కమల్ ఉండే హాస్టల్లోకి ప్రవేశిస్తుంది. అబ్బాయిలు ఉండే హాస్టల్లోకి వెళ్లిన జిలేబీ బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో కమల్ తన స్నేహితులు బుజ్జి, బాబీ, వాషింగ్టన్ సహాయం కోరతాడు. మరి జిలేబీ బాయ్స్ హాస్టల్ నుంచి ఎలా బయటపడింది. ఎమ్మెల్యే అయిన ఆమె తండ్రి రుద్ర ప్రతాప్‌రానా వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ ధైర్యం ఏం చేశాడు? అనేది స్టోరీ. మరి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి?