Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్..

Untitled Design (2)

Untitled Design (2)

Pyaar Prema Kalyanam OTT : థియేటర్ల కంటే ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ కామెడీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. నటుడు ఎలాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ను చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ మూవీ 2026 ఆగస్టు 21 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. థియేటర్ విడుదల లేకుండానే నేరుగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రానుంది. ఈ తమిళ మూవీ తెలుగు, మలయాళం, కన్నడ  భాషలలో కూడా అందుబాటులోకి వస్తోంది.

ఈ సినిమా కథ

ఈ కథ పావి అనే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత కూడా తన కుటుంబాన్ని విడిచి వెళ్లాలని ఆమె కోరుకోదు. దీంతో ఆమె భర్త ఆమె ఇంటికే వచ్చి నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచి రెండు కుటుంబాల మధ్య రోజువారీ జీవితంలో వచ్చే సరదా సంఘటనలు, చిన్న చిన్న అపార్థాలు, ఎమోషన్స్ కథను ముందుకు నడిపిస్తాయి. సంప్రదాయ కుటుంబ విలువలు, ఈ తరం దాంపత్య జీవితం మధ్య సాగే ఈ స్టోరీని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

తారాగణం 

ఈ మూవీలో ఎలాన్ సరసన సాన్వే మేఘన కథానాయికగా నటించారు. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్, హాస్యనటుడు యోగి బాబు, ఎంఎస్ భాస్కర్, గీతా కైలాసం, ఎలాంగో కుమారవేల్, సెంథిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని యువన్ శంకర్ రాజా అందించగా, ఆయన స్వరాలు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా ఎలాన్ వ్యవహరించారు. ఆసక్తికరంగా, ఈ సినిమా పేరు ఆయన 2018లో తెరకెక్కించిన తొలి మూవీ ‘ప్యార్ ప్రేమ కాదల్’ను గుర్తు చేస్తుంది. అయితే కథ పరంగా ఇది పూర్తిగా కొత్త చిత్రం అని తెలుస్తోంది. రొమాన్స్, కుటుంబ బంధాలు, వినోదం కలగలిసిన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ మంచి వినోదాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.