Site icon NTV Telugu

Saiyaara OTT: ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సైయారా.. ఎందులో చూడచ్చంటే?

Saiyaara

Saiyaara

Saiyaara OTT: ప్రస్తుతం సినిమాలు వందల సంఖ్యలో విడుదలవుతున్న గాని.. కేవలం పదుల సంఖ్యలో మాత్రం కూడా విజయాలు అందుకోవట్లేదు. పెద్ద మొత్తంలో తారాగణం, భారీ యాక్షన్స్ సీన్స్ ఇలా ఎన్ని ఉన్నాకానీ కంటెంట్ లేకపోతే మాత్రం సినిమాను ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. మరోవైపు, ఎలాంటి భారీతారాగణం లేకపోయినా కేవలం కంటెంట్ ఉంటే మాత్రం చాలు అన్నట్లుగా సినీ ప్రేక్షకులు చిన్న సినిమాలైనా సరే భారీగా ఆదరిస్తున్నారు. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన ‘హార్ట్ బీట్’ సినిమా చెప్పవచ్చు. సినిమాలో ఎక్కడ పెద్దపెద్ద సెటప్స్ గాని, యాక్షన్స్ సీన్స్ కానీ లేకపోయినా కేవలం అవుట్ అండ్ అవుట్ కామెడీతో సినిమా భారీ విజయం అందుకుంది. ఇకపోతే, బాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సయ్యారా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది.

Manchu Bonding : కరుగుతున్న ‘మంచు’.. మనోజ్ సినిమాకు విష్ణు స్పెషల్ విషెష్

ఆహాన్ పాండే, అనీత్ పద్ద హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు వారి హిట్ ను అందించారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమానుయష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. రిలీజ్ వరకు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అది ఎంతలా అంటే, బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.580 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టేలా. ముఖ్యంగా సినిమాలో పండించిన లవ్ సింప్లిసిటీ, మ్యూజికల్ మ్యాజిక్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేటి (సెప్టెంబర్ 12 )నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సినిమాను థియేటర్లో చూడకపోతే చూసి ఎంజాయ్ చేయండి.

Deepfake Scam: సద్గురు డీప్‌ఫేక్ వీడియోతో మహిళ నుండి రూ.3.75 కోట్లు స్వాహా చేసిన స్కామర్లు!

Exit mobile version