కన్నడలో ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయిన ‘కాంతార’ సినిమా, ఆ తర్వాత పాన్ ఇండియా హిట్ అయ్యింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. కన్నడనాట KGF రికార్డులని కూడా చెరిపేసిన ‘కాంతార’ ఇండియా వైడ్ 400 కోట్లు రాబట్టింది. ఎవరూ కలలో కూడా ఊహించని ఈ పాన్ ఇండియా హిట్ మూవీని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కి బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఓపెనింగ్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో ‘కాంతార’ సినిమా గూస్ బంప్స్ తెస్తుంది. చివరి అరగంట ఆడియన్స్ ని థియేటర్స్ లో కుర్చీలకి కట్టి పడేసిన ‘కాంతార’ సినిమా ఈమధ్య కాలంలో ఏ మూవీకి రానంత పేరు తెచ్చుకుంది. నటుడిగా కూడా రిషబ్ శెట్టి అనే సూపర్ స్టార్ కన్నడ నుంచి ఇండియాకి పరిచయం అయ్యాడు. కాంతార సినిమాని థియేటర్స్ లో చూసిన వాళ్లు ఈ మూవీ ఒటీటీలో రిలీజ్ అయితే చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి తెరదించుతూ ‘కాంతార’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. ఇంట్లో కూర్చోని ఈ సినిమా ఆడియన్స్ ‘కాంతార’ సినిమాని ఓవర్ రేటెడ్ అంటున్నారు. ఈ మూవీని ఎక్కువగా లేపారు, సినిమాలో అంత విషయం లేదు. క్లైమాక్స్ తీసేస్తే ‘కాంతార’ సినిమా చాలా బోర్ కొడుతుంది. బాగుంది కానీ మరీ అందరూ చెప్తున్నట్లు క్లాసిక్ మూవీ అయితే కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
థియేటర్ లో చూసినప్పుడు బాగున్న సినిమా ఇంట్లో కూర్చోని చూస్తున్న సమయంలో బాగోలేక పోవడానికి కారణం… కాంతార సినిమా స్కేల్. ఆ మూవీని తెరకెక్కించిందే థియేటర్స్ ఎక్స్పీరియన్స్ కోసం. అందుకే తెరపై చూసినప్పుడు వచ్చిన ఫీల్, టీవీలో చూస్తే రాకపోవచ్చు. పైగా ‘కాంతార’ సినిమాకి ఆయువు పట్టుగా ఉన్న ‘వరాహరూపం’ సాంగ్ కాపీ రైట్ ఇష్యూ కారణంగా ‘కాంతార’ సినిమా నుంచి తొలగించారు. కాపీ రైట్ సమస్య పరిష్కారం అయ్యింది కానీ మేకర్స్ ఇంకా ఓటీటీలో ‘వరాహరూపం’ పాటని యాడ్ చేయలేదు. ఈ సాంగ్ లేకపోతే ‘కాంతార’ సినిమా పూర్తయ్యినట్లు అనిపించదు. ఆ లోటే ఆడియన్స్ తో ‘కాంతార’ని ఓవర్ రేటెడ్ సినిమా అనిపించేలా చేస్తోంది. ఇది ‘కాంతార’ విషయంలోనే కాదు థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఎన్నో హిట్ సినిమాలకి వినిపించిన మాటే. అందుకే మంచి సినిమా సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ కి వెళ్లిపోయి ఎంజాయ్ చేయాలి. అప్పుడే ఆ సినిమాలోని మజా తెలుస్తుంది.