అష్టా చెమ్మ సినిమా నుంచి ఇప్పటివరకూ గయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని మైంటైన్ చేసిన నాని, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. తన మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి నాని చేస్తున్న పాన్ ఇండియా ప్రయత్నం ‘దసరా’ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ టీజర్ ఇటివలే రిలీజ్ అయ్యి వైల్డ్ ఫైర్ లా పాజిటివిటి స్ప్రెడ్ చేసింది. టీజర్ లో నాని లుక్, డైలాగ్స్, ఫ్రేమింగ్ అన్ని సూపర్ అనే చెప్పాలి. దసరా ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా అనే నమ్మకాన్ని టీజర్ తోనే అందరిలోనూ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. “ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం” అంటూ ‘దసరా’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘ఓరి వారీ’ని అనౌన్స్ చేశాడు నాని. వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రిలీజ్ చెయ్యబోతున్న ఈ సాంగ్ ప్రోమోని బయటకి వదిలారు. ‘ఓరీ వారీ నీది గాదురా ఆ పోరీ’ అనే క్యాచీ లైన్ తో ఈ ప్రోమో ఆకట్టుకుంది. ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఫిబ్రవరి 13 వరకూ ఆగాల్సిందే.
శ్రీమణి రాసిన లిరిక్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ స్వయంగా పాడడం విశేషం. అతని వాయిస్ లో సాంగ్ సౌండింగ్ మరింత బాగుంది. ఫుల్ సాంగ్ ఇంకా బాగుంటే, ఈ వ్యాలెంటైన్స్ డేకి సింగల్ గా ఉన్న వాళ్లు, బ్రేక్ అప్ అయిన వాళ్లు ఈ ‘ఓరి వారీ’ సాంగ్ ని పాడడం మొదలు పెడతారు. ఇప్పటికే దసరా సినిమా నుంచి ‘దోస్తాన్’ సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. కథకి, నేటివిటీకి స్టిక్ అయ్యి మేకర్స్ దసరా సినిమాలోని సాంగ్స్ కి ‘దోస్తాన్’, ‘ఓరివారీ’ లాంటి టైటిల్స్ పెడుతున్నట్లు ఉన్నారు. మరి మొదటి పాట ‘దోస్తాన్’ లాగే ఈ సెకండ్ సాంగ్ ‘ఓరివారీ’ కూడా ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అవుతుందేమో చూడాలి. పైగా నాని సినిమాలో హార్ట్ బ్రేక్ సాంగ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. నిన్ను కోరి సినిమాలో ‘ఉమా గాడి లైఫ్’ అనే సాంగ్ బ్రేక్ ఏంథమ్ గా మిగిలిపోయింది. ఇదే రేంజులో ‘ఓరివారీ’ సాంగ్ కూడా ఉంటే సౌండ్ బాక్సులు మొగిపోవడం గ్యారెంటీ.
Tap your feet while you whine in pain 💔#Dasara second single #OriVaari promo out now!
Full Song on February 13th❤️🔥
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @saregamasouth pic.twitter.com/livxzUNfgs
— SLV Cinemas (@SLVCinemasOffl) February 11, 2023
https://www.youtube.com/watch?v=qsabhSGNYuw