Site icon NTV Telugu

OG: పవన్ – ప్రియాంక మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్ లాక్! ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్

Og

Og

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి తన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ, హరీష్ శంకర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్’ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి కాగా.. డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ రెండింటిలో ఓజీపై అందరి చూపు నెలకొంది. తాజాగా ఓజీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read : Manisha Koirala : రిలేషన్లే నా జీవితాన్ని నాశనం చేసాయి: మనీషా కోయిరాలా

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి మధ్య సాగే సన్నివేశాలు, రొమాంటిక్ మూడ్, కెమిస్ట్రీ ఫ్యాన్స్‌కి ఇమోషనల్ ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయని మూవీ టీం హామీ ఇస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటగా వచ్చే మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫైనల్ చేశారట.  ఈ పాటను ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు సమాచారం. అంటే, ఫ్యాన్స్ కేవలం కొన్ని రోజుల్లోనే ఈ ప్రత్యేకమైన మెలోడీని చూడగలరని చెప్పవచ్చు. మేకర్స్ నుంచి దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version