పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి తన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ, హరీష్ శంకర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్’ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి కాగా.. డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు…