OG : డైరెక్టర్ సుజీత్ కు అగ్నిపరీక్ష మొదలైంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓజీ సినిమా రాబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా సుజీత్ కు చావో రేవో అన్నట్టే తయారైంది. ఎందుకంటే సుజీత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ తీసిన సాహో.. ఆకాశాన్ని తాకే అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. కలెక్షన్లు పర్లేదు అనిపించినా.. సుజీత్ అప్పుడు అంచనాలను అందుకోలేకపోయాడు.
Read Also : Sai Durga Tej : సెకండ్ క్లాస్ లోనే లవ్ చేశా.. రీసెంట్ గా బ్రేకప్ అయింది
ఇప్పుడు ఓజీతో తానేంటో నిరూపించుకుంటనే తర్వాత అతని భవిష్యత్ కు బంగారం లాంటి బాటలు పడుతాయి. లేదంటే మాత్రం కెరీర్ డైలమాలో పడటం ఖాయం అన్నట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్ అంచనాలను పెంచాయి. ఇక మిగిలింది థియేటర్లలో తానేంటో నిరూపించుకోవడమే. ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచడం ఎలాగూ ఖాయమే. కాబట్టి థియేటర్ లో ఎగ్జామ్ పాస్ అయితే సుజీత్ కు పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు క్యూ కడుతాయి. పవన్ కల్యాణ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఓజీకి ఏ మాత్రం పాజిటివ్ ఆక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత ఖాయం. కాబట్టి సుజీత్ ఈ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
Read Also : Maruthi : బూతులు మాట్లాడితేనే సినిమాలు చూస్తున్నారు..
