Site icon NTV Telugu

OG : ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే

Og

Og

OG : ఓజీ సినిమా హంగామా మొదలైంది. రిలీజ్ కు ఇంకో ఐదు రోజులు ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా భారీ అప్డేట్ ఇచ్చింది టీమ్. రేపు అనగా సెప్టెంబర్ 21న సాయంత్రం ఓజీ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా మూవీ టీమ్ అప్డేట్ చేశారు. అయితే ఇది కేవలం పాటలకు సంబంధించిన కాన్సర్ట్ లాగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్‌ వస్తారా లేదా అన్నదానిపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎల్బీస్టేడియంలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ కు మూవీ టీమ్ మొత్తం హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఒక్క పవన్ రాక మీదనే క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..

సెప్టెంబర్ 25న సినిమా రావాల్సి ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్‌ ఈ సినిమాలో ఓషీ అనే పాట పాడాడు. దాన్ని నిన్న రిలీజ్ చేశారు. ఇక మిగతా సినిమా అప్డేట్లు త్వరలోనే వస్తాయని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే 22న ఉంటుందనే ప్రచారం అయితే నడుస్తోంది. కానీ ఎంత వరకు నిజం అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ కల్యాన్ ప్రమోషన్లకు దూరంగానే ఉంటున్నారు. ఈ సినిమాపై ఇంతకంటే అంచనాలు పెంచడం ఇష్టం లేక సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Read Also : Sharwanand : న్యూ లుక్ లో శర్వానంద్.. ఫొటోలు వైరల్

Exit mobile version