OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా పవన్ హీరోగా అంటేనే ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ మొదలైపోతుంది. ఇక ఈ సినిమా కోసం.. మేకర్స్ ఒక్క్కొకరిని దింపుతుంటే.. పవన్ ఫ్యాన్స్ హైప్ తోనే చచ్చిపోయేలా ఉన్నారు. తాజాగా ఈ చిత్రం కోసం బాలీవుడ్ హీరోను మేకర్స్ రంగంలోకి దింపారు. బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీని OG లోకి ఆహ్వానించారు. అది కూడా పవన్ కు విలన్ గా అంటే అర్ధం చేసుకోండి ఏ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారో. ఇప్పటివరకు ఇమ్రాన్ హష్మీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేసింది లేదు. అయినా అతడి గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు.
Samantha: బహుమతుల కోసం ప్రార్ధించలేదు.. బలం కోసం ప్రార్ధించా
” మన దగ్గర శక్తివంతమైన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఉన్నప్పుడు.. అతడిని ఎదుర్కొనేవాళ్ళు కూడా అంతే అద్భుతంగా ఉండాలి కదా .. అందుకే ఇమ్రాన్ హష్మీని తీసుకొచ్చాం” అంటూ మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇమ్రాన్ – పవన్ మధ్య ఫైట్ సీన్స్ ను ఊహించుకుంటేనే థియేటర్స్ తగులుపడిపోవడమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ క్యాస్టింగ్ ఇక్కడితో ఆగుతుందా…? ఇంకా ముందు ముందు ఇంకెవరినైనా దింపుతారా..? అనేది తెలియాల్సి ఉంది.
When we have the #OG, we should also have a badass who is powerful and striking… 🔥🔥🤙🏻
Presenting you all, the nemesis @EmraanHashmi! #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/CmBBTFvSdR
— DVV Entertainment (@DVVMovies) June 15, 2023
