బ్రేకింగ్ : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్న విషయం విదితమే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందని చాలా రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తుండగా, మేకర్స్ మాత్రం సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తామని ఇప్పటి వరకూ చెప్తూ వచ్చారు. అయితే ఒకవైపు రోజురోజుకూ ఆందోళకరంగా మారుతున్న పరిస్థితులు, మరోవైపు రూమర్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా విడుదల గురించి ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారని చెప్పాలి. నిన్నటిదాక కూడా సినిమా విడుదల ఉంటుందని చెప్పిన “రాధేశ్యామ్” నిర్మాతలు ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం వేరే మార్గం లేకపోవడంతో రాధే శ్యామ్ మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
Read Also : రూమర్స్ నమ్మొద్దు… ‘బంగార్రాజు’ అప్డేట్
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
“ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా మా సినిమా “రాధేశ్యామ్” విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. మీ బేషరతు ప్రేమ, మద్దతు కోసం అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో థియేటర్లలో కలుద్దాం..!” అంటూ సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. టైమ్ ట్రావెల్‌తో కూడిన ఈ భారీ పీరియాడిక్ ఎపిక్ లవ్ స్టోరీ కూడా కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు. అయితే మేకర్స్ మార్చి 18న సినిమాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
We have to postpone the release of our film #RadheShyam due to the ongoing covid situation. Our sincere thanks to all the fans for your unconditional love and support.
We will see you in cinemas soon..!#RadheShyamPostponed pic.twitter.com/aczr0NuY9r
— UV Creations (@UV_Creations) January 5, 2022
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!