రూమర్స్ నమ్మొద్దు… ‘బంగార్రాజు’ అప్డేట్

అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాళ్లు ఇద్దరూ సంక్రాంతికి వెండి తెరపై సందడి చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఇటీవల విడుదల చేసిన అప్డేట్స్ లో కూడా సంక్రాంతికి రాబోతున్నాం అని ప్రకటించేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల మధ్య సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ నేపహత్యంలో ‘బంగార్రాజు’ కూడా ఓటిటిలో విడుదల అవుతుందని పుకార్లు వ్యాపించాయి. మేకర్స్ ఓటిటి పుకార్లపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించి ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. నేరుగా మేకర్స్ నుండి వచ్చిన ఈ ప్రకటన అన్ని పుకార్లకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడేలా చేసింది. “ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ‘బంగార్రాజు’ థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. ‘బంగార్రాజు’ గురించి పుకార్లను నమ్మవద్దని అందరినీ కోరుతున్నాము” అంటూ ట్వీట్ చేశారు.

Read Also : మీ నెత్తిన ఎక్కి తొక్కామా ?… ఆర్జీవికి పేర్ని నాని కౌంటర్

ఇక ఈ రోజు సాయంత్రం 4. 30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు ‘బంగార్రాజు’ టీం. ఈ సమావేశంలో సినిమా విడుదల తేదీని అఫిషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. కాగా న్యూఇయర్ సందర్భంగా మేకర్స్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్. ‘బంగార్రాజు’లో నాగార్జున, రమ్య కృష్ణ వారి వారి పాత్రలను పునరావృతం చేస్తారు. చై, కృతి శెట్టి ఈ చిత్రంలో కొత్త జంటగా కన్పించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related Articles

Latest Articles