Site icon NTV Telugu

Thammu : ఆఫర్స్ ఒకే.. హిట్లు ఎక్కడ మిల్క్ బ్యూటీ

Milky Beauty

Milky Beauty

గ్లామరస్ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. ఒక్క తమిళంలోనే జైలర్, ఆరణ్మనై4తో హిట్ కొట్టానన్న శాటిస్పాక్షన్ దక్కింది. క్రెడిట్స్ మరొకరితో షేర్ చేసుకోవాల్సొచ్చింది. ఇదే టైంలో విజయ్ వర్మ బ్రేకప్ కూడా ముద్దుగుమ్మను బాధించినప్పటికీ త్వరగానే కోలుకుని మళ్లీ ఫుల్ ప్లెడ్జ్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య కాలంలో కాస్త బొద్దుగా కనిపించిన తమ్ము మళ్లీ ఫిట్ ఫిజిక్‌తో మెస్మరైజ్ చేస్తోంది.

Also Read : Bollywood : పవన్ కళ్యాణ్ కు డిజాస్టర్ ఇచ్చిన సౌత్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో

బాలీవుడ్‌లో ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నా తమన్నా ఖాతాలో ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. బీటౌన్‌లో క్రేజ్ పడిపోతోంది, ఆఫర్లు రావడం లేదనుకుంటున్న టైంలో ఒక్క స్పెషల్ సాంగ్ తో మొత్తం కవర్ చేసేస్తోంది. అందుకు ఎగ్జాంపుల్స్ స్త్రీ2, రైడ్2 సాంగ్సే. ఈ సాంగ్స్‌తో సినిమాలకు ప్లస్ అవుతూ తనపై అటెన్షన్ తీసుకుని ఆఫర్లను కొల్లగొడుతోంది. ప్రస్తుతం విజయ్‌తో విడిపోవడం కూడా తమన్నాకు కలిసొచ్చింది. పెళ్లి విషయంలో విజయ్ హ్యాండిచ్చాడన్న టాక్ మధ్య తమ్మూపై సింపథీ పెరిగి ఆఫర్లను కట్టబెడుతోంది నార్త్ బెల్ట్.  ప్రస్తుతం బాలీవుడ్‌లో మునుపెన్నడూ లేనంత బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ. రొమియో, రేంజర్, రాగిణి ఎంఎంఎస్3, రోహిత్ శెట్టి ఫిల్మ్‌తో పాటు వివాన్ అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో కమిటైంది. అలాగే డూ యూ వన్న పార్ట్ నర్ అనే ఓటీటీ సిరీస్ చేస్తోంది. డయానా పెంటీతో కలిసి చేస్తోన్న ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మొత్తానికి  ఆఫర్స్ అయితే రాబడుతోంది కానీ హిట్స్ మాత్రం అందుకోలేకుంది. ఓదెల2తో ప్లాప్ అందుకున్న తమ్ము మళ్లీ తెలుగు వైపు తొంగి చూసేదెప్పుడో.

Exit mobile version