NTV Telugu Site icon

Nuvve Nuvve: ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ వంతు..!!

Nuvve Nuvve

Nuvve Nuvve

Nuvve Nuvve: మన స్టార్ హీరోల బర్త్ డే‌ను పురస్కరించుకుని వాళ్ళు నటించిన సినిమాల స్పెషల్ షోస్ వేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలను అలానే ప్రదర్శించారు. అయితే ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం విడుదలై ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్ దాన్ని రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’ విడుదలై ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీని స్పెషల్ షోను ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని ఎ.ఎం.బీ.లో ప్రదర్శించబోతున్నారు. ఈ స్పెషల్ షోకు మూవీ టీమ్ మొత్తం హాజరు కానుంది. మాటల రచయితగా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ మూవీని తెరకెక్కించి, ఆ తర్వాత ఇక వెను తిరిగి చూసుకోలేదు. ఇవాళ ఆయన తెలుగు చిత్రసీమలో టాప్ ఫైవ్ డైరెక్టర్స్ లో ఒకరంటే అతిశయోక్తి కాదు.

Read Also: SP Sailaja Birthday Special: అన్నకు తగ్గ చెల్లెలు ఎస్పీ శైలజ

నువ్వే నువ్వే సినిమాకు కోటి అందించిన పాటలు కూడా ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. ఈ మూవీలో తరుణ్ సరసన శ్రియ హీరోయిన్‌గా నటించింది. బొమ్మరిల్లు సినిమాలో కొడుకుపై అతి ప్రేమ చూపే పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్.. ఈ మూవీలో కుమార్తెపై ప్రేమను చూపించడంలో తన అభినయాన్ని పండిస్తాడు. ప్రకాష్ రాజ్, చంద్రమోహన్ క్యారెక్టర్లు కూడా ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.

Show comments