NTV Telugu Site icon

Ramabanam: ఈ లవ్ మెలోడి బాగుంది గురూ…

Ramabanam

Ramabanam

యాక్షన్ హీరో, మ్యాచో మాన్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలయ్య బాబు ఫిక్స్ చేసిన ఈ టైటిల్, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యి, మంచి హిట్స్ అయ్యాయి. మాస్ సినిమాలు చేసే గోపీచంద్ ని కామెడీ వైపు తీసుకొచ్చిన శ్రీవాస్, రామబాణం సినిమాని అందరికీ కనెక్ట్ అయ్యే అన్నదమ్ముల కథతో రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో గోపీచంద్ కి అన్నగా జగపతిబాబు నటిస్తున్నాడు. జగ్గు భాయ్ అన్నగా, గోపీచంద్ తమ్ముడిగా ఆల్రెడీ కలిసి నటించారు. ఎటు చూసినా హిట్ కాంబినేషన్ కనిపిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది.

Read Also: Prabhas: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో బాహుబలి కాంబినేషన్ రిపీట్ అవుతోంది

మే 5న రిలీజ్ కానున్న రామబాణం సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మేకర్స్ లేటెస్ట్ గా రామబాణం సినిమా నుంచి ‘నువ్వే నువ్వే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ‘శ్రీలీల’ ఈ సాంగ్ ని లాంచ్ చేసింది. మిక్కీ జే మేయర్ మంచి ఫీల్ గుడ్ ట్యూన్ ఇవ్వగా, శ్రీమణి క్యాచీ లిరిక్స్ రాసాడు. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో హీరో హీరోయిన్ మధ్య డిజైన్ చేసిన ఈ మెలోడీ సాంగ్ వినడానికి చూడడానికి బాగుంది. గోపీచంద్, డింపుల్ హయాతిల పెయిర్ కూడా ఆన్ స్క్రీన్ బాగానే ఉంది. మరి ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్న రామబాణం సినిమా మే 5న హిట్ అవుతుందో లేదో చూడాలి.