Nushrratt Bharucha: నాకూ ఒకరున్నారు.. సింగర్‌తో డేటింగ్‌పై నుష్రత్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nushrratt Bharucha Gives Clarity On Dating Rumours: ఇద్దరు సెలెబ్రిటీలు కాస్త చనువుగా మెలిగితే చాలు.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు బాలీవుడ్ నటి నుష్రత్ భారుచా, సింగర్ హనీ సింగ్‌లపై అలాంటి రూమరే రీసెంట్‌గా షికారు చేసింది. ఒక ఈవెంట్‌లో పాల్గొన్న తర్వాత నుష్రత్ చేతులు పట్టుకొని హనీసింగ్ బయటకు రావడం, ఇద్దరు కాస్త చనువుగా ఉన్నట్టు కనిపించడంతో.. వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. వాళ్లిద్దరు ఈ రూమర్లను వెంటనే ఖండించకపోవడంతో.. నిజంగా వాళ్లు ప్రేమలో ఉన్నారని మరింత ప్రచారం జరిగింది. అయితే.. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా నుష్రత్ తోసిపుచ్చింది. అంతేకాదు.. తనపై ఇలాంటి రూమర్ వచ్చినందుకు అమ్మడు సంతోషం కూడా వ్యక్తం చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడి కట్టిన ‘ఛత్రపతి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నుష్రత్ తన డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
నుష్రత్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఇదే ఫస్ట్ డేటింగ్ రూమర్. నేను ఎవరితోనూ పెద్దగా తిరగను కాబట్టి నాపై ఇన్నాళ్లూ ఎలాంటి రూమర్ రాలేదు. కానీ, హనీసింగ్‌తో డేటింగ్ చేస్తున్నాననే పుకారు విన్న తర్వాత నాకు ఏదో తెలియని ఆనందం కలిగింది. వావ్, నాకూ ఒకరు ఉన్నారన్నమాట అని సర్‌ప్రైజ్ అయ్యా. ఇకపై ఎవరడిగినా సరే, నాపై కూడా ఓ లవ్ రూమర్ ఉందని చెప్పుకుంటా. అయితే.. ఈ రూమర్‌లో ఎలాంటి వాస్తవం లేదు. నేను, హనీ సింగ్ డేటింగ్ చేసుకోవడం లేదు. అయినా.. ఈ జనాలకు బొత్తిగా పని లేకుండా పోయింది. ఏదేదో ఊహించుకుంటూ ఎప్పుడూ ఊహల్లోనే బతికేస్తుంటారు. ఇప్పుడు నా గురించి కూడా ఏదేదో అనుకుంటున్నారు. వాళ్లు ఏమనుకున్నా సరే, నేనేం పట్టించుకోను. నాకు ఎలాంటి సమస్య లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. నుష్రత్, హనీసింగ్ కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించారు. అప్పటినుంచి తరచుగా కలుస్తుండటంతో.. వీళ్లు డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్ తెరమీదకి వచ్చింది.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!