కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడానికి సిద్ధంగా ఉన్న జవాన్ సినిమా షారుఖ్ ని బాలీవుడ్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇవ్వడంతో అయిదేళ్లుగా సైలెంట్ గా ఉన్న షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చారు. షారుఖ్ ని చూడడానికి ‘మన్నత్’ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ సమయంలో షారుఖ్ ఇంట్లో లేకపోయినా, ఇంటి ముందు నిలబడి ఫోటోస్ తీసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మన్నత్ దగ్గరికి వచ్చిన ఫ్యాన్స్ ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ వీడియోలో చూసేయండి.