“ఎన్టీఆర్ 30” లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆయన అభిమానులు ఎగిరి గంతేసే సమాచారం అందింది. దర్శకుడు శివ కొరటాల కాంబినేషన్లో ఎన్టీఆర్ రెండో ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేశాడు. రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై పడింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వచ్చే ఈ మూవీ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఎన్టీఆర్30” అనే తాత్కాలిక పేరుతో పిలుస్తున్నారు. ఈ పాన్ ఇండియా హీరో, స్టార్ డైరెక్టర్ ఇద్దరూ తమ పనులను వీలైనంత తొందరగా ముగించుకుని “ఎన్టీఆర్ 30″ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Read Also : ఫారిన్ లో “సర్కారు వారి పాట”కు టీమ్ రెడీ
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఈ నేపథ్యంలో “ఎన్టీఆర్ 30” లాంచ్ కి ముహూర్తం ఖరారయ్యిందట. తాజా సమాచారం ప్రకారం సినిమా అక్టోబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30 వ సినిమా. అంతకుముందు ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ గానీ, లేదంటే అలియా భట్ కానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కన్పించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను పూర్తి చేశాక ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను 2022 ద్వితీయార్ధంలో ప్రారంభిస్తాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!