ఫారిన్ లో “సర్కారు వారి పాట”కు టీమ్ రెడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దుబాయ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే “సర్కారు వారి పాట” కోసం మేకర్స్ ఫారిన్ లో లొకేషన్లు కూడా ఫైనల్ చేశారట.

Read Also : బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని

ఇటీవల మహేష్ గోవా షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. చిన్న విరామం తర్వాత హైదరాబాద్ షెడ్యూల్‌ను ప్రారంభించాడు. హైదరాబాద్ శరవేగంగా జరుగుతున్న షెడ్యూల్ సెప్టెంబర్ చివరి నాటికి కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అక్టోబర్ రెండవ వారంలో యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. అక్టోబర్ చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ షెడ్యూల్‌లో దర్శకుడు పరశురామ్ కొన్ని పాటలతో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-