NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ప్రస్తుతం సినీ, రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరును ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ‘వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ’గా మారుస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక ఈ విషయమై ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయనే ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ ను యాడ్ చేసి ‘డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ” గా నామకరణం చేసారని, అలాంటిది ఇప్పుడు ఈ పేరును ఎలా మారుస్తారని నందమూరి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
హెల్త్ యూనివర్సిటీని మొదలుపెట్టింది ఎన్టీఆర్ కాబట్టి ఆయన పేరుమీదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టినట్లు నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక తాజాగా ఈ ఈ విషయంపై జూ. ఎన్టీఆర్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశాడు. “ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరును పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
— Jr NTR (@tarak9999) September 22, 2022