Site icon NTV Telugu

NTR: అయాన్ కలిసింది వార్ 2 కోసం కాదు… టైగర్ 3లోనే యంగ్ టైగర్

Ntr

Ntr

బ్రహ్మాస్త్ర పార్ట్ 1 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హైదరాబాద్ వచ్చి మరీ కలవడంతో… వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వార్ 2 స్టార్ట్ అవుతుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికే అయాన్ హైదరాబాద్ వచ్చాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసిన మాట వాస్తవమే కానీ అది వార్ 2 విషయంలో కాదు టైగర్ 3 విషయంలో అంట. సల్మాన్ ఖాన్ టైగర్ క్యారెక్టర్ లో నటిస్తున్న మూడో సినిమా టైగర్ 3 నవంబర్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కూడా ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేస్తున్న టైగర్ 3 సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుంది.

యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న టైగర్ 3 సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి… వార్ 2 కాన్ఫ్లిక్ట్ ని స్టార్ట్ చేయాలని యష్  రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం మాట్లాడడానికే అయాన్ ఎన్టీఆర్ కి కలిసాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టైగర్ 3 షూటింగ్ కంప్లీట్ అయిపొయింది కాబట్టి ఎన్టీఆర్ టైగర్ 3 సినిమాలో ఉన్నాడు అనే వార్తలో నిజం ఉండకపోవచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కనిపించేది పోస్ట్ క్రెడిట్స్ లో వచ్చే సీన్ మాత్రమే కాబట్టి జస్ట్ ఎన్టీఆర్ వరకూ షూట్ చేసినా… దాన్ని టైగర్ 3 కి అటాచ్ చేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. సో ఇప్పటికే టైగర్ 3 సినిమా సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ తో పవర్ ప్యాక్డ్ గా ఉంది. వీళ్లకి ఇక ఎన్టీఆర్ కూడా కలిస్తే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చినట్లే.

Exit mobile version