మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా వాయిదా పడింది. ఇటివలే దాస్ కా ధమ్కీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన విశ్వక్ సేన్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాను అని చెప్పాడు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న రూమర్ ని బట్టి చూస్తే దాస్ కా ధమ్కీ సినిమా మార్చ్ 22న ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. మిడ్ వీక్ లో, ఉగాది పండగ రోజున మేకర్స్ ధమ్కీ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసి వస్తుండడంతో విశ్వక్ సేన్ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు ఫస్ట్ మండేకే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ మార్చ్ 18న ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను గెస్ట్ గా పిలిచే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దాస్ కా ధమ్కీ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రేంజులో సౌండ్ చెయ్యాలి అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ లాంటి హీరో రావాల్సిందే. పైగా విశ్వక్ సేన్, ఎన్టీఆర్ కి చాలా పెద్ద ఫ్యాన్. సో దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తే అది ఎన్టీఆర్ ఫాన్స్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ ఇవ్వడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే దాస్ కా ధమ్కీ ఓవర్సీస్ రైట్ కి రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఇక రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తే విశ్వక్ సేన్ ఫాన్స్ జోష్ లోకి వచ్చేస్తారు.
Happy to annouce that we acquired overseas theatrical rights of @VishwakSenActor #Dhamki #DasKaDhamki .overseas release by @Radhakrishnaen9 @Nivetha_Tweets @Ram_Miriyala @LyricsShyam @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/GyESyklGDO
— Radhakrishnaentertainments (@Radhakrishnaen9) February 28, 2023