యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. జనతా గ్యారేజ్ తో టాలీవుడ్ లోనే హిట్ కొట్టిన కొరటాల శివ-ఎన్టీఆర్ దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవరకి ఎదురు నిలబడే బలమైన విలన్ గా సైఫ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి సీన్స్ ని షూట్ చేయడం స్టార్ట్ చేసాడు కొరటాల శివ. ఈరోజు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు కావడంతో దేవర మేకర్స్ నుంచి పోస్టర్ బయటకి వచ్చింది. సైఫ్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ స్వయంగా ఎన్టీఆర్ ఈ పోస్టర్ ని లాంచ్ చేయడం విశేషం.
‘భైరా… హ్యాపీ బర్త్ డే సైఫ్ సర్…’ అంటూ ట్వీట్ చేసిన ఎన్టీఆర్, దేవర సినిమాలోని సైఫ్ లుక్ ని రివీల్ చేసాడు. లాంగ్ హెయిర్ తో ఇంటెన్స్ గా కనిపిస్తున్న సైఫ్ చాలా వయొలెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ డిజైన్ లో పడవలు, సముద్రం, పడవల్లో మనుషులు కూడా ఉన్నారు. దేవర vs భైర వార్ ఎలా ఉండబోతుంది అనేది తెలియదు కానీ ఇప్పటివరకు కొరటాల శివ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తుంటే మాత్రం రెండు డిఫరెంట్ ఫోర్సెస్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఉంది. దేవర లాంచ్ లో కొరటాల శివ చెప్పినట్లు చావుకి కూడా భయపడని రాక్షసుడిగా సైఫ్, అలాంటి రాక్షసుడిని కూడా భయపెట్టే వీరుడిగా ఎన్టీఆర్ లు చేయబోయే వార్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.
BHAIRA
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
— Jr NTR (@tarak9999) August 16, 2023