Site icon NTV Telugu

RRR: కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి .. ఎట్టకేలకు నోరు విప్పిన ఎన్టీఆర్

rrr

rrr

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెల్సిందే. ఇక అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి  తారక్ అభిమానులు కొందరు మాత్రం కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి చెందినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో చరణ్ పాత్ర ఎక్కువ హైలెట్ అయ్యిందని, తారక్ కు తక్కువ స్పేస్ ఇచ్చాడని రాజమౌళిని ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా  క్లైమాక్స్ ఫైట్ లో చరణ్ హైలెట్ అయ్యేలా డిజైన్ చేశారని ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే సినిమాలో ఏ హీరోను తక్కువచేసి చూపలేదని, ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్లు రాజమౌళి చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా ఈ వార్తలపై తారక్ స్పందించాడు. ” ఈ సినిమాలో ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ని జక్కన్న ఇచ్చాడు. ఒక సీన్ లో చరణ్ ని ఎలివేట్ చేసే సీన్స్ ఉంటే, మరొక సీన్ లో నన్ను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి. ఇద్దరికీ సమానంగా నటించే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థాంక్స్ చెప్తున్నాను. నా పాత్రకు సంబంధించి ఎటువంటి అసహనం కానీ, అసంతృప్తి కానీ లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువ చేయలేము.. అసలు ఆ ఇద్దరు లేకపోతే ఆర్ఆర్ఆర్ ఇంత అద్భుతంగా వచ్చేది కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ కొద్దిగా శాంతిస్తారేమో చూడాలి.

Exit mobile version