NTV Telugu Site icon

NTR: అక్కడ షూటింగ్ మొదలుపెట్టాడు… ఇక్కడ హంగామా చేస్తున్నారు…

Ntr 30

Ntr 30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ… కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హ్యుజ్ సెటప్, హాలీవుడ్ టెక్నిషియన్స్, బాలీవుడ్ హీరోయిన్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లాంటి బ్యాకింగ్ తో కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. చాలా రోజుల పాత డిలే అవుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లింది. భారి షిప్ పైన, కెన్నీ బేట్స్ డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్ తో చిత్ర యూనిట్ ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ ని మొదలు పెట్టారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత షూటింగ్ కి అటెండ్ అవుతున్న ఎన్టీఆర్, ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చెయ్యనున్నాడు. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టి మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజున ‘ఎన్టీఆర్ 30’ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే రోజున సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ పేరు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది.

ఇలాంటి సమయంలో ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ ని బయటకి వదిలితే హ్యూజ్ బజ్ జనరేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అలా షూటింగ్ మొదలుపెట్టాడో లేదో ఇక్కడ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా చెయ్యడం స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ బర్త్ డేకి ఇంకా 50 రోజులు మాత్రమే ఉండడంతో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నారు. రోజులు దగ్గర పడే కొద్దీ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోస్ బయటకి వస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ 30 అఫీషియల్ పోస్టర్ బయటకి వచ్చే వరకూ ఫ్యాన్ మేడ్స్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

Show comments