Site icon NTV Telugu

Chiranjeevi: నూటికో కోటికో ఒక్కరు NTR…

Chiranjeevi

Chiranjeevi

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మూల స్థంబాల్లో ముఖ్యుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ ఉన్నా అన్నగారి జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. రామారావుతో రెండు సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి… “నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…” అంటూ ట్వీట్ చేసాడు. చిరు ట్వీట్ చెయ్యడంతో మెగా-నందమూరి అభిమానులు జోహార్ ఎన్టీఆర్ అనే కామెంట్స్ పెడుతూ చిరు ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

Read Also: NTR Jayanthi: మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా…

Exit mobile version