Site icon NTV Telugu

War 2: వార్ సినిమాలో ఎన్టీఆర్ vs హృతిక్ హింట్ ఇచ్చారా?

War 2

War 2

గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కొంతమంది అది రూమర్ అన్నారు, మరికొంత మంది అది నిజమన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తూ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లు ట్విట్టర్ ని షేక్ చేసే అప్డేట్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్ ని విష్ చేస్తూ… “నీకోసం యుద్ధభూమిలో ఎదురు చూస్తూ ఉన్న మిత్రమా” అని ట్వీట్ చేసాడు. హ్రితిక్ ట్వీట్ కి “రోజులు లెక్కబెట్టుకోండి సర్, యుద్ధభూమిలో కలుద్దాం” అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఈ యుద్ధభూమి అనే పదం ఇద్దరు హీరోల ట్వీట్ లో కామన్ పాయింట్ గా ఉంది. ఎన్టీఆర్ అండ్ హ్రితిక్ వార్ 2 సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే క్వేషన్ అందరిలోనూ ఉంది. అయితే అది ఎన్టీఆర్ అండ్ హ్రితిక్ రోషన్ కాదు ‘ఎన్టీఆర్ vs హ్రితిక్ రోషన్’ అంటున్నారు బాలీవుడ్ వర్గాలు.

అసలు వార్ సినిమాలో వార్ 2కి సంబంధించిన హింట్ ఏమైనా ఇచ్చాడా అని ఒకసారి సినిమా చూస్తే ఒక ఊహించని క్లూ కనిపిస్తోంది. వార్ సినిమాలో హ్రితిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించాడు. కెప్టెన్ ఖాలిద్ గా టైగర్ మంచి రోల్ ప్లే చేయగా, హ్రితిక్ మేజర్ కబీర్ పాత్రలో నటించాడు. మేజర్ కబీర్ ఒక మిషన్ లో ఉన్న సమయంలో ఖాలిద్ తండ్రి, కబీర్ స్నేహితుడు అయిన అబ్దుల్ రహ్మాణి మోసం చేసి కబీర్ ని అతని ఫ్రెండ్ మేజర్ వజీర్ ని షూట్ చేస్తాడు. ఈ కారణంగా కబీర్, అబ్దుల్ ని చంపేస్తాడు. వజీర్ చనిపోయాడు అనుకుంటారు కానీ అతను చనిపోలేదు అనే విషయం తర్వాత రివీల్ చేస్తారు. ఈ వజీర్ కథనే వార్ 2 సినిమాలో చూపించే అవకాశం ఉంది. మొదటిలో కబీర్ అండ్ వజీర్ స్నేహితులు… తర్వాత వీళ్లు ఎలా టర్న్ అయ్యారు, ఈ ఇద్దరినీ అబ్దుల్ ఎలా మోసం చేసాడు? అనే కథతో వార్ 2 సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది.

Exit mobile version