NTR Last Daughter Uma Maheswari: నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కూతురు. ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్. ఉమామహేశ్వరి మరణవార్తను విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు.
కాగా ఉమా మహేశ్వరి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. చంద్రబాబు కుటుంబసభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. గత ఏడాది డిసెంబరులో ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి కూతురి నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఇటీవల పెళ్లిని జరిపించారు. ఈ వివాహం జరిగిన రోజుల వ్యవధిలోనే ఉమామహేశ్వరి మరణించారు.
Read Also: August Movies: ఆ సినిమాలపైనే అందరి ఆశలు!
కాగా సీనియర్ ఎన్టీఆర్‌కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో దగ్గుపాటి పురంధేశ్వరి ఒకరు. రెండో కుమార్తె చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి. మూడో కుమార్తె లోకేశ్వరి కాగా చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరి జీవితంలో మాత్రం చాలా విషాదం చోటుచేసుకుంది. ఆమెను నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేశారు. అయితే ఆయన చాలా శాడిస్ట్‌గా బిహేవ్ చేసేవాడు. సిగరెట్‌తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి తన తండ్రికి కష్టాలు చెప్పుకోవడంతో అప్పట్లో ఎన్టీఆర్ నరేంద్ర రాజన్‌తో తన కుమార్తెకు విడాకులు ఇప్పించి శ్రీనివాస్ ప్రసాద్‌కు ఇచ్చి రెండో వివాహం జరిపించారు.