NTR: హ్యాపీ బర్త్ డే సైఫ్… మా దేవరతో ఢీ కొట్టు… పాన్ ఇండియా హిట్ పట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హమ్ తుమ్’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న హీరో ‘సైఫ్ అలీ ఖాన్’, నార్త్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని చేసాడు. లవ్ ఆజ్ కల్, కాక్ టైల్, మే ఖిలాడీ టు అనారీ, కచ్చే దాగే, దిల్ చాహతా హై, పరిణీత, ఓంకార, రేస్, రేస్ 2 లాంటి సినిమాలతో హిందీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ, లవర్ బాయ్ అనే తేడా లేకుండా పాత్ర నచ్చితే సినిమా చేసే సైఫ్ అలీ ఖాన్… నెగటివ్ రోల్స్ ని కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే చేయడం మొదలుపెట్టాడు. ఇది అజయ్ దేవగన్ హీరోగా నటించిన తానాజీ సినిమాతో పీక్ స్టేజ్ కి చేరింది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ ‘ఉదయభన్ సింగ్ రాథోర్’ పాత్రలో సూపర్బ్ గా నటించాడు. విలనిజంని కళ్లతోనే చూపించిన సైఫ్ అలీ ఖాన్ కెరీర్ లో తానాజీ సినిమా మైల్ స్టోన్ లా నిలిచిపోయింది. ఇక్కడి నుంచి నెగటివ్ రోల్స్ ఎక్కువగా చేస్తున్న సైఫ్, ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా నటించాడు. నార్త్ నుంచి పాన్ ఇండియా బాట పట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. సైఫ్-ఎన్టీఆర్ మధ్య సీన్స్ దేవర సినిమాకి ప్రాణం పోస్తాయి అనడంలో సందేహం లేదు. తెరపై ఎన్టీఆర్ తో సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి యుద్ధం చేస్తాడు? ఎంతవరకూ ఎన్టీఆర్ ని ఆపే ప్రయత్నాలు చేస్తాడు? ఆ ప్రయత్నాల్ని దాటి ఎన్టీఆర్ ఎలా గెలుస్తాడు అనే పాయింట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే దేవర సినిమా అంత హిట్ అవుతుంది. ఈ హీరో-విలన్ ట్రాక్ ని కొరటాల శివ ఎలా డిజైన్ చేసాడు అనేది చూడాలి. ఈరోజు సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైఫ్ అలీ ఖాన్ ని ట్యాగ్ చేస్తూ విషెష్ చెప్తున్నారు. దీంతో #Devara #NTR #Saifalikhan ట్యాగ్ లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దేవర నుంచి సైఫ్ అలీ ఖాన్ బర్త్ స్పెషల్ గిఫ్ట్ బయటకి రాబోతుంది, మధ్యాహ్నం 2 గంటల వరకూ వెయిట్ చేయండి అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు. మరి దేవర నుంచి ఎలాంటి గిఫ్ట్ బయటకి వస్తుందో చూడాలి.
Also Read
2PM today. Stay tuned to @tarak9999. #Devara
— Devara (@DevaraMovie) August 16, 2023
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..