యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన రెండు సినిమా కోసం బాడీని బిల్డ్ చేసే పనిలో పడ్డాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. కొరటాల శివ దర్శహకత్వంలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 తెరకెక్కుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ 31 మీద యంగ్ టైగర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టేసుకుతున్నారు. అపజయం ఎరుగని దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోకు ఇచ్చే ఎలివేషన్స్ ఎలా అంతాయో కెజిఎఫ్ తో రుచి చూపించాడు. దీంతో ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఎలివేషన్స్ ఉండబోతాయో ఉహించుకొని సంబరపడిపోతున్నారు.
ఇక అన్ని తాము అనుకున్నట్లే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెజిఎఫ్ ఎంత హిట్ అయ్యిందో.. ఈ సినిమా కూడా అంతే హిట్ కావాలంటే ఆ సినిమాలోని హీరోయిన్ శ్రీనిధి శెట్టినే ఈ సినిమాలోనూ హీరోయిన్ గా తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. `కెజిఎఫ్` వంటి సెన్సేషనల్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే సౌత్ తో పాటు నార్త్ లోనూ గుర్తింపు పొందింది. ఇక ఈ సినిమాలో నటిస్తే ఆమె గుర్తింపు వలన కూడా సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఫ్యాన్స్ డిమాండ్ ను ప్రశాంత్ నీల్ కన్సిడర్ చేస్తాడా..? లేక వేరే హీరోయిన్ ను రంగంలోకి దింపుతాడా అనేది చూడాలి.