RRR ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. టీం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా తారక్, చరణ్‌లతో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేసిన ప్రత్యేక చిట్ చాట్ ఇంటర్వ్యూ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సరదాగా జరిగిన ఈ ఇంటరాక్షన్ సమయంలో కీరవాణి తాను కంపోజ్ చేసిన చెత్త పాటను చెప్పమని ఇద్దరో హీరోలను అడిగాడు.
Read Also : Sarkaru Vaari Paata : “పెన్నీ” సాంగ్ లోకి సితార ఎలా వచ్చిందంటే ?
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ ఠక్కున “భీమవరం బుల్లోడా” సాంగ్ తనకు నచ్చదని చెప్పాడు. “ఘరానా బుల్లోడు” నుంచి “భీమవరం బుల్లోడా” సాంగ్ అంటే ఇష్టం లేదని తారక్ చెప్పాడు. ఇంతలో రామ్ చరణ్ పాట పేరు చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ అతను సినిమా పేరుతో గందరగోళానికి గురయ్యాడు. దీంతో ఆ గ్యాప్ ను కూడా ఎన్టీఆర్ తీసేసుకుని తనకు పేర్లు అంతగా గుర్తుండవని చెప్పుకొచ్చాడు.