NTR: ఒకటి రెండు మూడు… దేవర వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు సిసలైన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో… దేవర సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ. కోస్టల్ ఏరియాలో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు కొరటాల. అందుకుతగ్గట్టే.. ఇప్పటికే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… నెక్స్ట్ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లోని విజువల్స్ వండర్ ఫుల్‌గా ఉంటాయని సమాచారం.
ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ కలిసి దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆచార్య ఫ్లాప్‌తో ట్రోలింగ్ ఫేజ్ చేసిన కొరటాల… దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది అంటే నేటి నుంచి సరిగ్గా 123 రోజుల్లో బాక్సాఫీస్ పై దేవర దండయాత్ర మొదలవ్వనుంది. దీంతో సోషల్ మీడియాలో ఒకటి రెండు మూడు దేవర వస్తున్నాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అభిమానుల్లో మరింత జోష్ నింపుతూ జనవరి 1న దేవర సినిమా నుంచి టీజర్ ని కానీ చిన్న గ్లిమ్ప్స్ ని కానీ బయటకి వదిలితే చాలు ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ అయిపోయినట్లే.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!