ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు… అందరూ న్యూ ఇయర్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్‌లో 2024కి వెల్‌కమ్ చెప్పనున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఈసారి ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లాడు యంగ్ టైగర్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత జనవరి ఫస్ట్ వీక్‌లో తిరిగి ఇండియాకు రానున్నాడు, ఎన్టీఆర్ రాగానే దేవర గ్లింప్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల పవర్ ఫుల్ గ్లింప్స్ కట్ చేసే పనిలో ఉన్నాడు. జనవరి 8న గ్లింప్స్ రిలీజ్ చేసి.. సెకండ్ వీక్‌లో దేవర మూవీ షూటింగ్‌లో మళ్ళీ జాయిన్ అవనున్నాడు ఎన్టీఆర్. ఇక గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసుకొని… ఫారిన్ ఫ్లైట్ ఎక్కేసాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఈసారి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు, ప్రస్తుతం అక్కడ మౌంటెన్ డ్యూ యాడ్ కి సంబంధించిన షూట్ చేస్తున్నాడు. ఈ షూట్ అయ్యాక మహేష్ దుబాయ్ లోనే న్యూఇయర్ వేడుకలు పూర్తి చేసుకొని… జనవరి ఫస్ట్ వీక్‌లో ఇండియాలో ల్యాండ్ అవనున్నాడు. వచ్చి రాగానే గుంటూరు కారం ప్రమోషన్స్‌లో పాల్గొననున్నాడు. జనవరి 6న హైదరాబాద్‌లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో… ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్ నుంచి రావడమే లేట్… దేవర గ్లింప్స్, గుంటూరు కారం ట్రైలర్ లు డిజిటల్ రికార్డులపై దండయాత్ర చేస్తాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో గుంటూరు కారం పై భారీ అంచనాలున్నాయి. జనవరి 12న గుంటూరు కారం థియేటర్లోకి రానుంది. దేవర ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.