NTV Telugu Site icon

NTR 30: తారకరత్న అకాలమరణం కారణంగా ఎన్టీఆర్ 30 వాయిదా…

Ntr Tarakaratna

Ntr Tarakaratna

మార్చ్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఓపెనింగ్ సెరిమొని ఈ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామంటూ పీఆర్వో వంశీ కాకా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్ వచ్చాడు. ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న మరణించడంతో నందమూరి శోకసంద్రంలో మునిగింది.

Read Also: Taraka Ratna: కొడుకుని చూసి తల్లడిల్లుతున్న తారకరత్న తల్లిదండ్రులు

Show comments