NTV Telugu Site icon

NTR: తీరం తాకనున్న ‘ఎన్టీఆర్ 30’ తుఫాన్

Ntr 30

Ntr 30

నందమూరి అభిమానుల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అప్డేట్ బయటకి వచ్చేసింది. ఎన్టీఆర్ 30 ముహూర్తం ఎప్పుడు? ఏ రోజు ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తూ ‘తుఫాన్ హెచ్చరిక’ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఒక ట్వీట్ బయటకి వచ్చింది. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ మార్చ్ 23న జరగబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. నిజానికి ఈ ముహూర్త కార్యక్రమం గత నెలలోనే జరగాల్సి ఉండగా తారకరత్న మరణించడంతో ‘ఎన్టీఆర్ 30’ లాంచ్ వాయిదా పడింది. కొత్త డేట్ మార్చ్ 23ని లాక్ చేసి ఎన్టీఆర్ 30 సినిమా ముహూర్త కార్యక్రమాన్ని చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. ఈ ముహూర్త కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తాడు అనే రూమర్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.

Read Also: John Wick: యాక్షన్ మూవీ నటుడి మృతి…

ఆచార్య సినిమా నుంచి చిరుకి కొరటాల శివకి మధ్య గ్యాప్ వచ్చింది అనే మాట ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మాటకి ఎండ్ కార్డ్ వెయ్యడానికి అయినా చిరు, ఎన్టీఆర్ 30 ముహూర్త కార్యక్రమానికి వస్తాడని అంతా అనుకుంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ 30 విషయంలో కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ దర్శకుడితో వర్క్ చేసిన ఆ మూవీ ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ కి విపరీతంగా బలైన కొరటాల శివ, ఎన్టీఆర్ విషయంలో అలాంటి తప్పు జరగకూడదనే స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేసాడట. రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాతో కొరటాల శివ ఎలా అయినా హిట్ కొట్టి ఆ సెంటిమెంట్ కి ఎండ్ కార్డ్ వేస్తాడేమో చూడాలి. నెక్స్ట్ సమ్మర్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ ని మార్చ్ 30న మొదలుపెట్టనున్నారు.

Show comments