Andhra Pradesh Election 2024: ఏపీలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగగా సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీ వ్యాప్తంగా 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
Actor Died: ప్రముఖ నటుడు కన్నుమూత
అయితే రెండు గంటల వరకూ పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో సుమారు 81 శాతం పోలింగ్ నమోదవ్వొచ్చని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికలు సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాదు అనే చెప్పాలి. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయేమో అనుకున్న అనేక సంఘటనలు నిన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జరిగాయి. ఈ విషయాన్ని మీడియా కూడా పెద్ద స్థాయిలో ప్రసారం చేసింది. ముఖ్యంగా మూడు లేనివిధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీద దాడులు జరిగాయి.
ఒక చోట ఎమ్మెల్యే ఓటర్ ను చేయి చేసుకోగా సదరు ఓటరు కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. అలాగే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల నుంచి వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల వాళ్ళ మీద దాడులు కూడా జరిగాయి. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ఓటర్లు లేదా వేరే వర్గానికి చెందినవారు ఎదిరించి, రాళ్లతో కొట్టడాలు కూడా జరిగిన ఘటనలు అనేకం రిపోర్ట్ అయ్యాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో అయితే నాటు బాంబులతో పాటు పెట్రోల్ బాంబులతో చెలరేగారు. ఇక చాలాచోట్ల వాహనాలను ధ్వంసం చేయటమే కాక కొన్నిచోట్ల తగలబెట్టిన కేసులు కూడా తెర మీదకు వచ్చాయి.
ఇక కొన్నిచోట్ల ఈవీఎంలను కూడా ధ్వంసం చేసిన కేసులు తెరమీదకు వచ్చాయి. ఇక రెండు పార్టీల కార్యకర్తలు హోరాహోరీగా పోరాడటమే కాదు తలలు పగలగొట్టుకున్నారు. ఈ రోజు కూడా ఈ గొడవలు కొనసాగుతూ ఉండడం గమనార్హం. కొన్నిచోట్ల పోలీసుల దెబ్బలు తిని వెనక్కి పరిగెడితే కొన్ని చోట్ల పోలీసులను కూడా ఎదిరించిన పరిస్థితులు కనబడ్డాయి. మొత్తం మీద ఈ ఎన్నికలు మాత్రం మునుపటి కంటే చాలా భిన్నంగా సినిమాలను తలదన్నే విధంగా ఉండడం గమనార్హం.