గత కొద్ది రోజులుగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లు వస్తున్నాయి. నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణలో సుకేష్ వీరికి ఖరీదైన బహుమతులు పంపినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నోరా స్పందించింది. అతని నుంచి బహుమతులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది.
Read Also : అనారోగ్యంతో ఉన్న అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్
ఈ కేసులో జాక్వెలిన్‌ని ఇప్పటికే చాలాసార్లు ప్రశ్నించారు. ఈడీ ప్రకారం సుఖేష్ చంద్రశేఖర్ డిసెంబర్ 2020లో నోరా ఫతేహికి BMW కారును బహుమతిగా ఇచ్చారని ఓ నేషనల్ మీడియా పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ ఆరోపణపై స్పందించిన నోరా… చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతిఫలంగా ఈ కారును సుఖేష్ చంద్రశేఖర్ భార్య లీనా మారియా తనకు ఇచ్చిందని చెప్పింది. తన అధికారిక ప్రకటనలో ఈ కేసులో తాను బాధితురాలిని అని పేర్కొంది. మనీలాండరింగ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.
2020 డిసెంబర్ 20, 2020న చెన్నైలో జరిగిన ఈవెంట్‌కు ముందు సుఖేష్‌తో మాట్లాడారా ? అని నోరాను అడిగినప్పుడు… “అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలియదు. కార్యక్రమానికి ముందు ఆయనతో మాట్లాడాను” అని చెప్పుకొచ్చింది. అదే రోజు సుకేష్ ఫోన్ చేసి నోరాకు కారు బహుమతిగా ఇస్తానని చెప్పినట్లు వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుతూ తాను సిగ్నల్ అప్లికేషన్‌ను ఎప్పుడూ ఉపయోగించలేదని తెలిపింది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
