బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రైవేట్ పిక్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమె 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరవుతుండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ ప్రైవేట్ పిక్ లీక్ అయ్యింది. అందులో సుకేష్ జాక్వెలిన్‌ను ముద్దుపెట్టుకోవడం కనిపించింది. ఆ పిక్ చూస్తుంటే సెల్ఫీలా ఉంది. ప్రస్తుతం జాక్వెలిన్ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్…
గత కొద్ది రోజులుగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లు వస్తున్నాయి. నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణలో సుకేష్ వీరికి ఖరీదైన బహుమతులు పంపినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నోరా స్పందించింది. అతని నుంచి బహుమతులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది. Read Also…