Site icon NTV Telugu

Salaar: పాటలున్నాయా లేవా నీల్ బ్రో…

Salaar

Salaar

డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే మాస్ జాతరకు శాంపిల్‌గా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరింది. ఇందులో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి… మరో పవర్ ఫుల్‌ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే… ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సలార్ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కెజియఫ్ చాప్టర్ 2 రిలీజ్ సమయంలో తుఫాన్ సాంగ్ రిలీజ్ చేసి… సినిమా రిలీజ్‌కు ముందే యష్ ఫ్యాన్స్‌ చేత విజిల్స్ వేయించాడు ప్రశాంత్‌ నీల్. ఇలాంటి సాంగ్ ఒక్కటి సలార్ నుంచి బయటికి వస్తే ప్రభాస్ అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ కానీ అది జరగట్లేదు. KGF సినిమా ప్రమోషన్స్ కి పాటలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. సలార్ నుంచి కూడా ఇలాంటి సాంగ్స్ రెండు బయటకి వస్తే ప్రశాంత్ నీల్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు.

అన్ అఫీషియల్ గా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం… సలార్ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని.. వాటిని థియేటర్లో మాత్రమే చూడాలి, వినాలి అనే టాక్ ఉంది. మరోవైపు కొంతమంది మాత్రం ఏ క్షణమైనా సలార్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే నిజమై ఒక్క హీరో ఎలివేషన్ సాంగ్ బయటకి వస్తే సోషల్ మీడియా మోత మోగిపోవడం గ్యారెంటీ. ఒకవేళ ప్రశాంత్ నీల్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయకుండా… ఫస్ట్ సింగిల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ బయటికి వస్తే మాత్రం సినిమాపై హైప్ మరింత పెరుగుతుంది. అయితే సినిమా రిలీజ్‌కు ముందు ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉంటుందా? లేదా? అనేది తేలడం లేదు. సినిమా పై మరింత హై రావాలంటే మాత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాల్సిందే. మరి ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో చూడాలి.

Exit mobile version