NTV Telugu Site icon

Salaar: షాకింగ్… డైనో’సలార్’ డైరెక్ట్ ఎటాక్?

Salaar

Salaar

మరో 40 రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ ఉంది. ఎంత హైప్ ఉన్నా… ఎంతకాదనుకున్నా కనీసం నెల రోజుల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సాంగ్ అప్డేట్ ఉంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉంది కానీ తాజాగా సలార్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. సలార్ నుంచి ఎలాంటి సాంగ్ రిలీజ్ చేయడం లేదట. సినిమాలో ఒకటే మెయిన్ సాంగ్ ఉంటుందట. అలాగే రెండు మూడు బిట్ సాంగ్స్ ఉంటాయట, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో మాత్రమే వస్తాయట. దీంతో రిలీజ్ వరకు సలార్ నుంచి సాంగ్స్ బయటికొచ్చే ఛాన్స్ లేదని సమాచారం. అందుకే డైరెక్ట్‌గా సలార్ ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్.

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజముందా? అంటే, ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే… తాజాగా బెంగూళురుకి వెళ్లాడు ప్రభాస్. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్‌తో ఫస్ట్ సాంగ్ డిస్కషన్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ మీటింగ్ అయిపోయాక సలార్ ఫస్ట్ సాంగ్ గురించి అప్డేట్ బయటకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది సలార్ థీమ్ సాంగ్ అని తెలుస్తోంది. సినిమాలో ఈ ఒక్క సాంగే ఉంటుందని టాక్. ఈ సాంగ్ కంప్లీట్ అయినా కూడా రిలీజ్ చేయకుండా… ట్రైలర్‌తోనే సలార్ డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సలార్ నుంచి సాంగ్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా డిజిటల్ రికార్డ్స్ అన్నీ పగిలిపోవడం పక్కా. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ 24 గంటల్లో 83 మిలియన్స్, రెండు రోజుల్లో 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి.. ట్రైలర్ ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఊహించుకోవచ్చు.

Show comments