NTV Telugu Site icon

Ponniyin Selvan 2: ‘పీఎస్2’కి ఊహించని షాక్.. అక్కడ తప్ప మిగతా భాషల్లో నిల్?

Ponniyin Selvan 2 Buyers

Ponniyin Selvan 2 Buyers

No Buyers For Ponniyin Selvan 2: సాధారణంగా సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడుతాయి. వాటి థియేట్రికల్ హక్కులకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ప్రేక్షకుల్లోనూ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ.. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విషయంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదని సమాచారం. తమిళంలో తప్ప.. మిగతా భాషల్లో ఈ చిత్రానికి సరిగ్గా బిజినెస్ జరగట్లేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పీఎస్2 హక్కుల్ని కొనేందుకు ఇంతవరకు ఎవ్వరూ ముందుకు రాలేదట. దీంతో.. మణిరత్నంని రంగంలోకి దింపి, బయ్యర్స్‌ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట! అప్పటికీ హక్కులు అమ్ముడుపోకపోతే.. ఓన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. అటు.. బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రంపై ఏమాత్రం హైప్ లేదు. ఇందుకు.. పీఎస్1 ఇతర రాష్ట్రాల ఆడియెన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోవడమే!

Actor Shiva Krishna: అది వెబ్ సిరీస్ కాదు, బ్లూ ఫిలిమ్.. సీనియర్ నటుడు ఫైర్

చెప్పుకోవడానికి పొన్నియిన్ సెల్వన్ రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టగలిగింది కానీ, ఇతర రాష్ట్రాల్లో అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఇదో హిస్టారికల్ మూవీ అయినప్పటికీ.. తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించిందని, ఈ సినిమా పెద్దగా సినిమాటిక్ అనుభూతి ఇవ్వలేదని కామెంట్లు వినిపించాయి. క్రిటిక్స్ కూడా తొలి భాగానికి ఆశాజనకమైన రివ్యూలు ఇవ్వలేదు. అందుకే.. రిలీజ్ దగ్గరపడుతున్నా, ‘పీఎస్2’కి పెద్దగా క్రేజ్ ఏర్పడటం లేదని తెలుస్తోంది. కాగా.. తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా రెండు భాగాల్లో రూపొందింది. ఇందులో కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిషా మొదలైన స్టార్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక్క కోలీవుడ్‌లోనే రూ.200 కోట్లు కొల్లగొట్టి, ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన తొలి తమిళ చిత్రంగా అక్కడ రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.

Live-in Relationship: ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై సహజీవనం.. చివర్లో పెద్ద ట్విస్ట్