టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. నితిన్ చివరి చిత్రం మ్యాస్ట్రో కొద్దిగా నిరాశపర్చడంతో ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమా కోసం నితిన్ ఏకంగా విశ్వనటుడినే రంగంలోకి దింపుతున్నాడు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా తెలుగు రైట్స్ నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకున్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలో నితిన్ కూడా విక్రమ్ మూవీ ప్రమోషనల్స్ లో భాగమయ్యాడు. ఆ సినిమాతో పాటే నితిన్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.
ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది. ఇక ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. వీరితో పాటు నితిన్ కూడా ఈ ఈవెంట్ కు రానున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమాలోని మొదటి సాంగ్ ను కమల్ చేతుల మీద విడుదల చేయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.`చిల్ మరో చిల్ మారో’ అంటూ సాగే ఈ సాంగ్ను రేపు విడుదల చేయనున్నట్లు నితిన్ తెలిపాడు. ఇక పోస్టర్ లో నితిన్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఏదిఏమైనా ఈ కుర్ర హీరో కమల్ ను బాగానే వాడేస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Get ready to groove to the beats of #MacherlaNiyojakavargam🥁
1st single #ChillMaaro😎Song Launch Tomorrow @ #VikramHitlist Pre Release Event by UlagaNayagan @ikamalhaasan🤩@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar @SreshthMovies @adityamusic #MNVfromAug12th pic.twitter.com/tHcSWdo5l3
— nithiin (@actor_nithiin) May 30, 2022