Exclusive : ఇంకెన్నాళ్లు.. రాడ్ రంబోలా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్న నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిల్ తో నితిన్ పేరు మారు మోగిపోయింది. దాంతో ఈ కుర్రాడు స్టార్ హీరోల సరసన చేరతాడు అని అందరు ఊహించారు. అంతలోనే సంబరం సినిమాతో తొలి ప్లాప్ చూసాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.
Also Read : Thammudu : తమ్ముడు ఓవర్శీస్ రివ్యూ..
Also Read
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. అయినా సరే హిట్ కోసం పోరాడుతూ 2012లో ఇష్క్ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ‘అఆ’ హిట్ తర్వాత తర్వాత 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేసాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్. ఛల్ మోహన రంగ కాస్త పరవాలేదు. మిగిలిన సినిమాలు వేటికవె పోటాపోటీగా ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్. రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన తమ్ముడు కూడా మిశ్రమ స్పందన రాబట్టింది. ఇవన్నీ చూస్తుంటే నితిన్ కథల ఎంపిక ఎంత దారుణంగా ఉందొ అర్ధం అవుతోంది.
Also Read : Tollywood : తెలుగులో సెటిలైపోయిన పరభాష స్టార్ హీరో
తమ్ముడు ఓపెనింగ్ షోస్ ఫుల్స్ లేవంటే సిచుయేషన్ ఏంటో ఆయనకే తెలియాలి. అసలు నితిన్ కథలు ఎవరు వింటున్నారో అనే డౌట్ రాక మానదు. టాలివుడ్ లో వినిపించే దాన్ని బట్టి నితిన్ చుట్టూ ఉండే కోటరీ వలెనే ఆయనకు ప్లాప్స్ అనే టాక్ ఉంది. తొలి సినిమాతో భారీ హిట్ కొట్టి ఇప్పుడు హిట్ కోసం అల్లాడిపోతున్నాడు అంటే తప్పు ఎక్కడ జరుగుతుందో నితిన్ తెలుసుకోవాలి. యాక్టింగ్, కామెడీ టైమింగ్ అన్ని ఉండి కూడా నితిన్ దారుణ పరాజయాలు చూస్తున్నాడు. ఆ మధ్య మాస్ మాస్ అని జపం చేసి ప్లాప్స్ రావడంతో లవ్ స్టోరీస్ చేసి హిట్ కొట్టాడు. ఆఆ తర్వాత ఆ కథలకు స్వస్తి చెప్పి ఏవేవో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రం తమ హీరో ఈ సినిమాతో హిట్టు కొట్టకపోతాడా అని ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ నితిన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో రాడ్ రంబోలా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాడు. ఈ ప్లాప్ ల పరంపర ఇలాగె కొనసాగితే నితిన్ కనుమరుగు అయిపోయిన టాలీవుడ్ హీరోల లిస్ట్ లో చేరడం ఖాయం.
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!